ఉప్పల్, డిసెంబర్ 27 : కాలనీల సంక్షేమమే లక్ష్యం అని, కాలనీ సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. ఉప్పల్ డివిజన్లోని కురుమ సంఘం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సోమవారం ఎమ్మెల్యేను కలిసి.. కాలనీలో కమ్యూనిటీహాల్ నిర్మించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీవాసుల అవసరాలు గుర్తించి తగిన సహకారం అందిస్తామన్నారు. కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. మిగతా కాలనీల్లో కూడా సమస్యలు ఏమైనా ఉంటే చెప్పితే.. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో కాలనీవాసులు మైసయ్య, సోమయ్య, యాదగిరి, రాములు, బ్రహ్మచారి, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన క్రైస్తవ ప్రతినిధులు
ఉప్పల్ చర్చికాలనీకి చెందిన పాస్టర్ ప్రకాశ్ ఆధ్వర్యంలో క్రైస్తవ ప్రతినిధులు సోమవారం ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ వేడుకలకు తెలంగాణ ప్ర భుత్వం సహాయ, సహకారాలు అందించడంపై అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, బద్దం భాస్కర్‌రెడ్డి, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, గాయం శ్రీధర్‌రెడ్డి, మేకల ముత్యంరెడ్డి, జేసీబీ రాజు, మహేశ్, క్రైస్తవ ప్రతినిధులు పాల్గొన్నారు.