WPL 2026 : భారత జట్టు వన్డే ప్రపంచకప్ విజయంలో కీలకమైన దీప్తి శర్మ(Deepti Sharma)కు యూపీ వారియర్స్ పెద్ద షాకిచ్చింది. మహిళల ప్రీమియర్ నాలుగో సీజన్ కోసం ఆమెను కాదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మేగ్ లానింగ్(Meg Lanning)కు కెప్టెన్సీ అప్పగించింది. ఆదివారం ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా యూపీ ఫ్రాంచైజీ వెల్లడించింది. మూడు సీజన్లు ఢిల్లీ క్యాపిటల్స్‌ను నడిపించిన లానింగ్.. ఈసారి తమ జట్టు టైటిల్ కలను సాకారం చేస్తుందని యూపీ వారియర్స్ యాజమాన్యం భావిస్తోంది.
‘కెప్టెన్‌గా కంటే సుదీర్ఘ అనుభవం, స్పష్టత, ప్రశాంత వంటి చాలా ప్రత్యేక లక్షణాలు లానింగ్లో ఉన్నాయి. ఆటను అర్ధం చేసుకునే సామార్థ్యం, ఒత్తిడిని అధిగమించే తీరు, జట్టు సభ్యులతో ఆమె కలిసిపోయే తీరు.. అన్నీ లానింగ్‌ను యూపీ వారియర్స్‌కు మంచి కెప్టెన్‌గా చేస్తాయి’ అని హెడ్‌కోచ్ అభిషేక్ నాయర్ పేర్కొన్నాడు.
Bol Shafali rahi hain, par jazbaat Warriorz Sena ke hain… 🥹💜
Just Meg Lanning things 🫶🙌#UPWarriorz #UttarDega #TATAWPL pic.twitter.com/MqVujeyQ1G
— UP Warriorz (@UPWarriorz) January 4, 2026
డబ్ల్యూపీఎల్‌లో ఒక్కసారి కూడా ఫైనల్ చేరని యూపీ వారియర్స్ ఈసారి ట్రోఫీపై కన్నేసింది. ఇటీవలే ముగిసిన వేలంలో దీప్తి శర్మను రూ.3.2 కోట్లకు తిరిగి సొంతం చేసుకుంది. దాంతో.. ఈసారి టీమిండియా ఆల్‌రౌండర్‌కే సారథ్యం అప్పగిస్తారనే వార్తలు వినిపించాయి. అలానే అనుభవజ్ఞురాలైన మేగ్ లానింగ్‌ను వేలంలో రూ.1.9 కోట్లకు తీసుకుంది. దాంతో, వీరిద్దరిలో ఒకరు జట్టును నడిపిస్తారని అనుకున్నారంతా. అయితే.. ఈ మెగా టోర్నీలో లానింగ్ రికార్డును దృష్టిలో పెట్టుకొని కీలక బాధ్యతలు కట్టబెట్టింది. లానింగ్ 27 మ్యాచుల్లో 952 పరుగులు చేసింది. మూడో సీజన్లో అలీసా హేలీ గాయపడడంతో దీప్తి శర్మ కెప్టెన్‌గా వ్యవహరించింది.
Presenting the 2026 Warriorz Clan. 💜💛🔥#UPWarriorz #UttarDega #TATAWPL pic.twitter.com/s8H6QZjPgS
— UP Warriorz (@UPWarriorz) November 28, 2025