లక్నో/పనాజీ/డెహ్రాడూన్: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడుత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. అలాగే ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీ ఎన్నికలకు కూడా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం యూపీలోని 55 స్థానాలకు, ఉత్తరాఖండ్‌లోని మొత్తం 70 సీట్లకు, గోవాలోని మొత్తం 40 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో నిబంధనల ప్రకారం శనివారం సాయంత్రం ప్రచారం ముగిసింది. యూపీ రెండో విడుతలో అత్యధికంగా 586 మంది పోటీ పడుతున్నారు.