టేకులపల్లి,అక్టోబర్ 26 : స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఎస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొమ్మర వరప్రసాద్, బోడ బాలు నాయక్ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని గ్రామాలో బీఆర్ఎస్ జెండాను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు, పార్టీ ఉనికిని తెలియజేసేందుకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసిలు అప్పారావు, బాలకృష్ణ, మండల నాయకులు తేజావత్ రవి, భూక్యా లాలు నాయక్, బానోత్ రామా నాయక్, ఆ మెడ రేణుక, లక్పతి, నాన్న వాళ్ళ భిక్షం, బోడ రమేష్, బి ప్రసాద్, కే రామ్ కుమార్, మూడు రాజ్ కుమార్, మూడు హుస్సేన్, మూడు బాలు, బానోతు బన్సీలాల్ పాల్గొన్నారు.