వరంగల్, మార్చి 27: కాజీపేట–వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. గురువారం రాత్రి Km.No. 374/22-24 డౌన్ లైన్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 35-40 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి ట్రైన్ నం. 20806 ఏపీ ఎక్స్‌ప్రెస్ కిందపడి మృతి చెందాడు. రైలు కింద పడటంతో తలకు, ఇతర శరీర భాగాలకు తీవ్రగాయాలై అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడు క్రీమ్ కలర్ ఫార్మల్ ప్యాంట్, యాష్ & బ్లూ కలర్ ఫుల్ షర్ట్ ధరించి ఉన్నాడు. సుమారు 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు, ఎరుపు వర్ణం, నల్లని తల వెంట్రుకలు, గడ్డం, మీసాలు కలిగి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కుడి చేతి పైన “Jadhavmam” అనే ఇంగ్లీష్ పచ్చబొట్టు తప్పా మరే ఇతర ఆధారాలు లభించలేదు.
రైల్వే అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని ఎంజీఎం దవాఖాన మార్చురీలో భద్రపరిచి, దర్యాప్తు చేపట్టారు. మృతుడి ఆచూకి తెలిసిన వారు. 9701747014, 8712658627 ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.