RS Praveen Kumar | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘ చరిత్ర గలిగిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యూనివర్సిటీలను ఫ్యూచర్ సిటీకి తెస్తానని అబద్దాలు చెబుతున్నాడని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హార్వర్డ్ యూనివర్శిటీ 385 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ కూడా బోస్టన్ అనే ప్రాంతంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా తమ క్యాంపస్ ఓపెన్ చేయలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) వాళ్లు ఓపెన్‌గా చెప్పారు.. మేము బోస్టన్ తప్ప ఎక్కడా కూడా క్యాంపస్ ఓపెన్ చేయడం లేదు.
కేంబ్రిడ్జి యూనివర్సిటీ కూడా తాము లండన్‌లో తప్ప ఎక్కడా క్యాంపస్ ఓపెన్ చేయడం లేదు. 900 సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రపంచంలోనే పురాతనమైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా ప్రపంచంలో ఆక్స్ఫర్డ్ అనే ప్రాంతంలో తప్ప వేరే ఎక్కడా తమ క్యాంపస్ ఓపెన్ చేయడం లేదని వాళ్లు చాలా క్లియర్‌గా చెప్పారు. మీరు హైవీలీక్స్ అంటున్నరు.. అంటే హార్వర్డ్, ప్రిన్స్టన్, యేల్, డాట్మౌత్, బ్రౌన్, కొలంబియా, కొర్నేల్ ఈ కాలేజీలు ఏవీ కూడా ఈ యూనివర్సిటీలు వాళ్ల యూనివర్సిటీల క్యాంపస్‌ల నుంచి బయటకు రావు రేవంత్ రెడ్డి అని సూచించారు.
మీకు మీ ఆఫీసర్లు ఎందుకు చెప్పలేదో నాకు తెలియదు. ప్రపంచంలో చాలా ఈ 200-300 సంవత్సరాల వయస్సున్న ఈ యూనివర్సిటీలు వేరే దేశాల్లో ఎక్కడా కూడా క్యాంపస్‌లు పెట్టరన్నారు. మీరు కేవలం వాళ్లను హెలికాప్టర్లో తీసుకొచ్చి ఇక్కడ ల్యాండ్ చేయాలని చూస్తున్నరు.. అది ఇంపాజిబుల్ అని అన్నారు.
385 సంవత్సరాల చరిత్ర ఉన్న హార్వర్డ్ యూనివర్శిటీ బోస్టన్ అనే ప్రాంతంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా తమ క్యాంపస్ ఓపెన్ చేయమని చెప్పారు
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కూడా లండన్‌లో తప్ప మరెక్కడా లేదు
900 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా ఆక్స్ఫర్డ్ అనే ప్రాంతంలో తప్ప వేరే… https://t.co/IP4P39WwuI pic.twitter.com/y9BEjZdRe0
— Telugu Scribe (@TeluguScribe) August 25, 2026