బూర్గంపహాడ్, ఆగస్టు 25 : వ్యక్తి అదృశ్యంపై బూర్గంపహాడ్ పోలీస్టేషన్లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రమైన బూర్గంపహాడ్కు చెందిన కోట ప్రసాద్ ఈ నెల 17న ఇంటి నుండి ఎరుపురంగు స్కూటీపై బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి నేటి వరకు ఇంటికి తిరిగి రాలేదు. భార్య, కుటుంబ సభ్యులు ప్రసాద్ ఆచూకీ కోసం బంధువులు, చుట్టుపక్కల వారిని, స్నేహితులను విచారించినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో భార్య కోట ధనలక్ష్మి మంగళవారం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్ఐ మేడా ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోట ప్రసాద్ ఆచూకీ ఎవరికైనా తెలిస్తే పోలీస్ స్టేషన్ 8712682056 లేదా కోట ప్రసాద్ భార్య(9951940428)కు సమాచారం ఇవ్వాలని కోరారు.