BWF Rankings | భారత షట్లర్ల దూకుడు.. చరిత్రాత్మక కాంస్యంతో 12 ర్యాంకులు పైకి..!
BWF Rankings : భారత మహిళా షట్లర్లు గాయత్రి గోపిచంద్(Gayatri Gopichand), త్రీసా జాలీ (Treesa Jolly) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు. పతకంతో మెరిసిన ఈ జంట ఏకంగా 12 స్థానాలు ఎగబాకింది.
BWF Rankings : భారత మహిళా షట్లర్లు గాయత్రి గోపిచంద్(Gayatri Gopichand), త్రీసా జాలీ (Treesa Jolly) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ (BWF Championships)లో పతకంతో మెరిసిన ఈ జంట ఏకంగా 12 స్థానాలు ఎగబాకింది. ఈ మెగా టోర్నమెంట్లో సంచలన విజయాలతో కాంస్యం గెలవడం ద్వారా 27వ స్థానం సాధించిందీ గాయత్రి- త్రిసా జోడీ.
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ మహిళల డబుల్స్‌లో చరిత్రాత్మక కాంస్యం గెలుపొందిన గాయత్రి గోపిచంద్, త్రీసా జాలీ ద్వయం ర్యాంకిగ్స్‌లో సత్తా చాటింది. టాప్ సీడ్లకు షాకిచ్చి కంచు మోత మోగించిన ఈ జంట.. 27వ ర్యాంక్‌కు ఎగబాకింది. ఈ టోర్నీ ఆరంభానికి ముందు 39వ ర్యాంక్‌లో ఉన్న గాయత్రి- త్రిసా జోడీ.. ఏకంగా 12 స్థానాలు మెరుగుపరచుకుంది.
World Championship bronze medallists Treesa Jolly and Gayatri Gopichand have jumped 12 places in the latest BWF Women’s Doubles Rankings, moving from World No. 39 to World No. 27 after their historic run in New Delhi.#Badminton #TreesaJolly #GayatriGopichand #BWFRankings pic.twitter.com/tweEdxjdwv
— Voice of Indian Sport (@vo_indiansport) August 25, 2026
సెమీ ఫైనల్లో ఓడినా యావత్ దేశం గర్వపడే పతకం అందించిందీ గాయత్రి గోపిచంద్, త్రీసా జాలీ జంట. అశ్విని పొన్నప్ప, గుత్తా జ్వాల అనంతరం.. మహిళల డబుల్స్‌లో పతకం ఖాయం చేసిన రెండో జోడీగా వీరు రికార్డు నెలకొల్పారు. 2011లో జ్వాల, అశ్వినిలు ఇదే ఈవెంట్లో కాంస్యం కొల్లగొట్టారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

