Suresh Gopi | కేంద్ర మంత్రి (Union Minister) సరేశ్ గోపీ (Suresh Gopi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి పదవి నుంచి దిగిపోవాలనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవలే కాలంలో తన ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని.. అందుకే మంత్రిగా దిగిపోయి మళ్లీ సినిమాల్లో నటించాలని ఉందంటూ చెప్పుకొచ్చారు.
మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారు 200కిపైగా చిత్రాల్లో నటించిన సురేశ్ గోపి 2016లో బీజేపీలో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో త్రిస్సూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆదివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన సినీ జీవితాన్ని తిరిగి కొనసాగించాని భావిస్తున్నట్లు తెలిపారు.
‘సినీ కెరీర్‌ను వదిలిపెట్టి మంత్రి కావాలని నేను ఎన్నడూ కోరుకోలేదు. ఇటీవలే కాలంలో నా ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నా. మళ్లీ సినిమాల్లో నటించాలని అనుకుంటున్నా’ అని తెలిపారు. మరోవైపు తన స్థానంలో కేరళకు చెందిన రాజ్యసభ సభ్యుడు సీ సదానందన్ మాస్టర్‌కు కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించాలని బీజేపీ అధిష్టాన్ని కోరారు.
Also Read..
ఆపరేషన్ బ్లూ స్టార్ తప్పే.. కాంగ్రెస్ నేత చిదంబరం ఒప్పుకోలు
పొరుగు దేశాల దుస్థితి మనకు లేదు.. దేశ ఐక్యతపై సీజేఐ గవాయ్