న్యూఢిల్లీ: పంజాబ్లోని స్వర్ణ దేవాలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి 1984లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్ ‘తప్పుడు మార్గం’గా కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అభివర్ణించారు. ఆ నిర్ణయానికి అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ మూల్యం చెల్లించారని అన్నారు. ‘స్వర్ణ దేవాలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి బ్లూ స్టార్ అన్నది తప్పుడు మార్గం’ అని అన్నారు.
హిమాచల్ ప్రదేశ్లో శనివారం జరిగిన ఒక సాహిత్య కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘అది ఆర్మీ, పోలీస్, ఇంటెలిజెన్స్, సివిల్ సర్వీస్ కలిసి తీసుకున్న సమిష్ఠి నిర్ణయం. దానికి ఒక్క ఇందిరా గాంధీనే నిందించ రాదు’ అని ఆయన అన్నారు. కాగా చిదంబరం వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత రహీద్ అల్వీ ఖండించారు. బహుశా ఆయన ఒత్తిడిలో ఉండి బీజేపీ మార్గాన్ని ప్రతిధ్వనిస్తున్నారని విమర్శించారు.