రత్నగిరి: అంతర్యుద్ధాలు, తీవ్ర గందరగోళ పరిస్థితులతో మన పొరుగు దేశాలు అల్లాడుతున్న వేళ భారత దేశం ఇంత బలంగా, ఐక్యంగా ఉందంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే కారణమని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. మహారాష్ట్ర రత్నగిరి జిల్లా మందన్గర్లో ఆదివారం కోర్టు భవనాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ స్వస్థలమైన అంబావ్డే కూడా ఉన్న ప్రాంతంలో ఇది ఏర్పడటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మనం అత్యవసర పరిస్థితిని చూశామని, అయినా బలంగా, ఐక్యంగా ఉన్నామని, దీనికి అంబేద్కర్ మనకు ప్రసాదించిన రాజ్యాంగమే కారణమని అన్నారు. న్యాయం అందరికీ చేరేలా చూసుకోవడానికి, న్యాయవ్యవస్థ విధుల పరంగా కార్యనిర్వాహకుడి నుంచి సహకారం పొందాలని ఆయన పేర్కొన్నారు.