ఖమ్మం రూరల్: ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో మున్నేటి సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన ఘటన ఆదివారం కలకలం రేపింది. మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డు సమీపంలోని మున్నేరు కాలువ చెక్ డ్యామ్ వద్ద అమృతదేహం సమీప ప్రాంతవాసుల కంటపడింది. దీంతో వారు పోలీసులకు ససమాచారం అందించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న రూరల్ పోలీసులు చనిపోయిన మృతుడి వివరాలు, చావుకు గల కారణాలు, హత్యనా, ఆత్మహత్యనా అనే కోణంలో విచారణ చేపట్టారు. ఖమ్మం నగర పరిధిలోని ఖానాపురంలో నివాసం ఉంటున్నట్టు ఇతని పూర్వం ఏన్కూరు మండలానికి చెందిన వాడుగా కొంత ప్రచారం జరుగుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.