తుంగతుర్తి, ఆగస్టు 24 : తుంగతుర్తిలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మత్స్యశాఖ నూతన కమిటీని జిల్లా సహకార సంఘం కార్యాలయ అసిస్టెంట్ రిజిస్టర్ కె.పద్మజ అధ్యక్షతన సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మత్స్యశాఖ అధ్యక్షుడిగా రెండోసారి కొండ లింగయ్య, ఉపాధ్యక్షుడిగా అంబటి బుచ్చయ్య, ప్రధాన కార్యదర్శిగా మామిడి నాగరాజు, మెంబర్లుగా మామిడి లింగయ్య, మామిడి నరేశ్, దిండి ముత్యాలు కొండ వెంకన్న, సాధు వెంకన్న, అంబటి బుచ్చయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకారుల సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తామని, తమ ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సభ్యులు, నాయకులు కొండ ఎల్లయ్య, కొండ రాజు, కొండా పరశురాం, సుధాకర్ పాల్గొన్నారు.