– విద్యారంగ సేవలకు దక్కిన గౌరవం
రుద్రంపూర్, ఆగస్టు 24 : సెయింట్ జోసెఫ్ హైస్కూల్, రుద్రంపూర్ ప్రిన్సిపాల్ బ్రదర్ రాజశేఖర్ రెడ్డికి ప్రతిష్ఠాత్మకమైన డా.ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైటెడ్ మైండ్ అవార్డు లభించింది. ఈ నెల 21, 22న భారత్ ఎడ్యుకేషన్ సమ్మిట్, హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు అవార్డు ప్రధానం చేశారు. విద్యారంగంలో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి చేస్తున్న కృషి, పాఠశాల అభివృద్ధి కోసం చూపుతున్న అంకితభావానికి గుర్తింపుగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. బ్రదర్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో సెయింట్ జోసెఫ్ హైస్కూల్ విద్యాబోధనకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో క్రమశిక్షణ, మానవీయ విలువలు, ఆత్మవిశ్వాసం, దేశభక్తి, సేవాభావం వంటి సుగుణాలను పెంపొందించే విద్యా కేంద్రంగా ముందుకు సాగుతోంది. ప్రతి విద్యార్థి ప్రతిభను గుర్తించి, వారి భవిష్యత్‌కు బలమైన పునాది వేయడంలో ఆయన చేస్తున్న కృషి ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు బ్రదర్ రాజశేఖర్ రెడ్డికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.