Natural Star Nani | భారీ అంచనాలతో తెరకెక్కిన యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise) సినిమా ట్రైలర్ లేకుండానే విడుదలవ్వనుంది. గత కొన్ని రోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తను హీరో, నేచురల్ స్టార్ నాని ధ్రువీకరించారు. శుక్రవారం మీడియాతో చిట్‌చాట్‌లో ట్రైలర్ లేకుండానే వస్తున్నామని, నేరుగా థియేటర్లోనే ప్రేక్షకులకు, అభిమానులకు సాలిడ్ హైప్ ఇచ్చి ఇంటికి పంపిస్తామని నాని తెలిపారు.
‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలున్నాయి. ఇప్పటికే ‘ఆయా షేర్’, ‘యేష నాగుల కట్ట’ పాటలు నెట్టింట వైరలవుతుండగా.. మునుపెన్నడూ లేనివిధంగా జడల గెటప్‌లో నాని పూనకాలు తెప్పించడం ఖాయమనిస్తోంది. అందుకని.. సినిమాలోని సస్పెన్స్‌ను మెయింటైన్ చేయడంతో పాటు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచడానికి ట్రైలర్ లేకుండానే సినిమాను నేరుగా థియేటర్లలోకి తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించింది. ఈ విషయాన్ని హీరో నాని అధికారికంగా ప్రకటించారు.
Nani confirms there will be NO TRAILER for #TheParadise 🔥
Probably the most hyped film after #Kabali to hit theatres WITHOUT a trailer.
Straight into the world of Paradise! 💥 pic.twitter.com/W1exSJJ7ec
— The Telugu Daily (@TheTeluguDaily_) September 11, 2026
శుక్రవారం సాయంత్రం మీడియాతో చిట్‌చాట్‌లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి మాట్లాడిన నాని సినిమాలో తన జడల లుక్, వెయ్యి మందితో ఫైట్ వార్తలపై స్పష్టత నిచ్చారు. ఆన్లైన్లో, మీడియాలో ప్రచారం అవుతున్నట్టు.. నీళ్ల అడుగున ఫైట్ లేదని.. 1000 మందితో కూడా ఫైట్ సీన్ లేదని నేచురల్ స్టార్ వెల్లడించారు. అంతేకాదు.. ‘సినిమాలో మీ జడల బరువు 6 కేజీలు ఉందా?’ అనే ప్రశ్నకు నవ్విన నాని.. ‘అంత బరువు లేదండి’ అని చెప్పారు.
ఈ చిత్రంలో ఒక్క ఫ్రేమ్ కూడా బోర్ కొట్టించదని పేర్కొన్న ఆయన.. సినిమా ఇంత బాగా రావడానికి యూనిట్‌లోని ప్రతిఒక్కరూ చెమటోడ్చారని తెలిపారు. స్క్రీన్ మీద ప్రతి సీన్లో టెక్నీషియన్ల కష్టం కనిపిస్తుందని ఆయన అన్నారు. షూటింగ్లో తనతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా గాయపడ్డారని, కానీ.. తన గాయాల గురించే మీడియాలో వార్తలు వచ్చాయని స్పష్టం చేశారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వనుంది.
Finally, the assurance everyone has probably been waiting for!
“Not even a single frame will be lazy. You’ll see the life of every technician in every scene. The media is highlighting only my injuries, but many characters in the film have suffered injuries too. Their injuries… pic.twitter.com/Fp6wyJEO4R
— Daily Culture (@DailyCultureYT) September 11, 2026