‘కిశోర బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి’
బాలికలు, కిశోర బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి పాటించాలని డిప్యూటీ కలెక్టర్ అపూర్వ, జిల్లా సంక్షేమ అధికారి కె.ప్రమీల అన్నారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని టీ డబ్ల్యూ ఆర్ ఈ ఎస్ - కూసుమంచికి చెందిన వసతి గృహంలో భేటీ బచావో బేటి పడావో కార్యక్రమంలో...
– డిప్యూటీ కలెక్టర్ అపర్ణ, డీడబ్ల్యూఓ ప్రమీల
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 11 : బాలికలు, కిశోర బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి పాటించాలని డిప్యూటీ కలెక్టర్ అపూర్వ, జిల్లా సంక్షేమ అధికారి కె.ప్రమీల అన్నారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని టీ డబ్ల్యూ ఆర్ ఈ ఎస్ – కూసుమంచికి చెందిన వసతి గృహంలో భేటీ బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా విద్యార్థినిలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు హాజరైన డిప్యూటీ కలెక్టర్, డీడబ్ల్యూఓ వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కిశోర బాలికలకు విద్యతో పాటు ఆరోగ్య, పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బాలికలు రుతుస్రావ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. చేతులు కడుక్కోవడం, శుభ్రమైన నీటిని వినియోగించడం ద్వారా అనేక సమస్యలను నివారించవచ్చున్నారు.
రక్తహీనత నివారణకు ఐరన్, పోలికి యాసిడ్ కలిగిన ఆకుకూరలు కూరగాయలు, పప్పు దినుసులు, పండ్లు తీసుకోవాలన్నారు. ఈ సమయంలో తీవ్రమైన కడుపునొప్పి, అధిక రక్త శ్రావణం ఎక్కువ రోజులు కొనసాగితే వైద్యులను సంప్రదించాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కనకదుర్గ సూచించారు. రుతు శ్రావణ సమయంలో జ్ఞాపకంలను మార్చడం తప్పనిసరి అన్నారు. ఇలాంటి సమయంలో బాలికలు పాఠశాలకు దూరం కాకుండా కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులు, సమాజం సహకరించాలన్నారు. వారి విద్య నిరంతరాయిగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె.సరిత, షీ టీం, విభాగాల సభ్యులు సమ్రీన్, ప్రమీల, వాసంతి తో పాటు ఐసిడిఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

‘కిశోర బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి’
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

