హైదరాబాద్, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ): దేవాదాయ, ధర్మాదాయ, భాషా సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం శ్రీశుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను ప్రగతిభవన్‌లోని ‘జనహిత’లో వైభవంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రముఖ వేద పండితుడు బాచంపల్లి సంతోష్‌కుమార్‌శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. తొలుత వేదపండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం అందించగా, ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చైర్మన్ కేవీ రమణాచారి స్వాగతవచనాలు పలికారు. అనంతరం పంచాంగకర్త సంపత్‌కుమార్ కృష్ణమాచార్య సిద్ధాంతి రూపొందించిన శుభకృత్ నామ సంవత్సర పంచాంగాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
దేవాదాయశాఖ తరఫున ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ముఖ్యమంత్రితో పాటు మంత్రులను సన్మానించారు. ఈ నెల 10న జరగనున్న భద్రాద్రి సీతారాముల కల్యాణం వేడుకల ఆహ్వాన పత్రికను వేద పండితులు సీఎంకు అందజేశారు. సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ సంపాదకీయంలో సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే ప్రచురించిన సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాల సంకలనం ‘మా తెలంగాణం.. కోటి ఎకరాల మాగాణం’ అనే పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజ్యసభలో టీఆర్ఎస్ పక్షనేత కే కేశవరావు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్‌అలీ, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, నిరంజన్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎంపీ లు కొత్త ప్రభాకర్‌రెడ్డి, పీ రాములు, మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెస్ ప్రభాకర్‌రావు, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్‌శర్మ, అనురాగ్‌శర్మ, సీఎం కార్యాలయ అధికారులు నర్సింగ్‌రావు, దేశపతి శ్రీనివాస్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.