న్యూఢిల్లీ, అక్టోబర్ 29: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.205.39 కోట్ల నికర లాభాన్ని గడించింది యూకో బ్యాం క్. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.30.12 కోట్లతో పోలిస్తే ఇది ఎన్నో రెట్లు అధికం. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.4,655.85 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. బ్యాంక్ నిరర్థక ఆస్తుల విలువ 11.62 శాతం (రూ.13,365 కోట్లు) నుంచి 8.96 శాతానికి (రూ.10,909.79 కోట్లు) దిగిరావడం, నికర ఎన్పీఏ కూడా 3.63 శాతం (రూ.3,813.88 కోట్లు) నుంచి 3.37 శాతానికి (రూ. 3,854.33 కోట్లు) తగ్గింది.