సూర్యాపేట : జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన సూర్యాపేట రూరల్ పరిధిలోని చందన కళాశాల సమీపంలో హైదరాబాద్ – విజయవాడ రహదారిపై శనివారం మధ్యాహ్నం చోటు చేసుకున్నది. కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామానికి చెందిన మేక హర్షవర్ధన్‌రెడ్డి (26), తిరుగుడు చంటి (25) నకిరేకల్ నుంచి బుల్లెట్ బండిపై సూర్యాపేట వస్తున్నారు. ఈ క్రమంలో కళాశాల సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు బండి జారిపడడంతో కిందపడిపోయారు. వెనుకాలే వచ్చిన గుర్తు తెలియని వాహనం వారిపై నుంచి వెళ్లింది. దీంతో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.