నల్గొండ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చందంపేట మండలం దేవరచర్లలో డిండివాగు ( Dindi Vagu) లో ఈ ఘటన జరిగింది. సాయి ఉమాకాంత్ అనే తొమ్మిదేళ్ల బాలుడు ఆడుకుంటూ డిండి వాగు సమీపంలోకి వెళ్లాడు. ప్రమాదవశాత్తు అందులో పడిపోగా చిన్నారని కాపాడబోయి ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన రాజు(25), భరత్‌కుమార్(27) మృత దేహాలను బయటకు తీశారు.
బాలుడు కోసం స్థానికులు, పోలీసులు గాలిస్తున్నారు. మృతులు ఏపీలోని తెనాలి నుంచి దసరా పండుగ సందర్భంగా బంధువుల ఇంటికి వచ్చి ప్రమాదానికి లోనయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.