హైదరాబాద్ : నాంపల్లి అగ్ని ప్రమాదం(Napanlli fire accident) ఘటనలో విషాదం చోటు చేసుకుంది. 20 గంటలకు పైగా జరుగుతున్న రెస్క్యూ ఆపరేపన్లో ఐదు మృతదేహాలను హబీబ్(32), ఇంతియాజ్(28), బేబి(45), అఖిల్(11), ప్రణీత్(7) వెలికితీశారు.సెల్లార్ గోడలకు రంద్రాలు చేసి రెస్య్యూ టీం లోపలికి వెళ్లి ఇద్దరు మృతదేహాలను గుర్తించారు. మిగతా వారి ఆచూకీ కోసం ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు.
కాగా, నాంపల్లిలో సహాయక చర్యలకు దట్టమైన పొగ ఆటంకంగా మారింది. భవనంలో చిక్కున్న ఆరుగురిని రక్షించేందుకు రెస్క్యూ టీంలు ప్రయత్నిస్తున్నాయి. సెల్లార్ అంతా ఫర్నీచర్ పరిచి ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం ఏర్పడుతున్నది. ప్రమాద ఘటపై ఎస్హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ కట్టడాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడింది.