హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రొ లీగ్ ఇండియా బెంగళూరులో నిర్వహించిన జాతీయస్థాయి పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో వరంగల్‌కు చెందిన శ్రీవాణిరెడ్డి స్వర్ణ పతకాలతో మెరిసింది. మహిళల 75 కిలోల విభాగంలో బరిలోకి దిగిన శ్రీవాణి..డెడ్‌లిఫ్ట్, బెంచ్‌ప్రెస్ విభాగాల్లో రెండు పసిడి పతకాలు ఖాతాలో వేసుకుంది. ఈ ప్రదర్శనతో జూలైలో పోర్చుగల్ వేదికగా జరిగే అంతర్జాతీయ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌నకు ఆమె ఎంపికయ్యారు. ఓవైపు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే పవర్‌లిఫ్టింగ్‌లో సత్తాచాటుతున్నది. పవర్‌లిఫ్టింగ్ అనేది పురుషుల కోసం మాత్రమే కాదని శ్రీవాణి మరోమారు నిరూపించారు. ధైర్యం, దృఢ సంకల్పం, దృష్టి కేంద్రీకరణ అనేవి ప్రతి పవర్లిఫ్టర్లో ఉండాల్సిన ముఖ్య అంశాలని ఆమె పేర్కొన్నారు.