అప్పులబాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
అప్పులబాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్నది. పోలీసులు, కుటుంబీకుల వివరాల ప్రకారం..
- ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో విషాదం
షాబాద్/తలమడుగు, నవంబర్ 15 : అప్పులబాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్నది. పోలీసులు, కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా తలమడుగుకు చెందిన రైతు నీలగిరి ఆశన్న (43) తన తల్లి పేరున ఉన్న మూడెకరాల భూమితోపాటు మరో 17 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. సాగుకోసం మహారాష్ట్ర బ్యాంకులో తల్లి పేరుపై రూ.1.50 లక్షలు, ప్రైవేట్‌గా రూ.10 లక్షలు అప్పు చేశాడు. ఈసారి వానలు సరిగా పడకపోవడంతో పంటలు పండలేదు. దీంతో అప్పు ఎలా తీర్చాలనే బెంగతో శనివారం రాత్రి ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆశన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం బోడంపహాడ్కు చెందిన రైతు చర్లగూడెం వెంకటయ్య(45) తన భార్య వరలక్ష్మితో కలిసి ఆదివారం ఉదయం చేనుకు పత్తి తీయడానికి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత వెంకటయ్య చేను నుంచి బయటకి వెళ్లాడు. చాలాసేపటికి వరకు వెంకటయ్య రాకపోవడంతో అతడి భార్య చేను నుంచి బయటకి వెళ్లి చూడగా పక్కనే ఉన్న నేరేడు చెట్టుకు నైలాన్ తాడుతో ఉరివేసుకుని కనిపించాడు. ఆర్థిక ఇబ్బందులతో వెంకటయ్య బాధపడుతున్నాడని, ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య ఫిర్యాదులో పేర్కొన్నది. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు షాబాద్ సీఐ డీకే లక్ష్మీరెడ్డి పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

