యువకలాలు రజతోత్సవం
ఏపీలోని బెజవాడ యువకలాలు రజతోత్సవం సందర్భంగా బీ ఆంజనేయరాజు సంస్మరణలో భాగంగా ఈనెల 19వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు విజయవాడ ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో ద్వితీయ ముద్రణ ఆవిష్కరణ సభ జరుగుతుందని బెజవాడ యువకలాలు నిర్వాహకులతోపాటు గ్రంథాలయ అధికారిణి కే రమాదేవి తెలిపారు.
ఏపీలోని బెజవాడ యువకలాలు రజతోత్సవం సందర్భంగా బీ ఆంజనేయరాజు సంస్మరణలో భాగంగా ఈనెల 19వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు విజయవాడ ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో ద్వితీయ ముద్రణ ఆవిష్కరణ సభ జరుగుతుందని బెజవాడ యువకలాలు నిర్వాహకులతోపాటు గ్రంథాలయ అధికారిణి కే రమాదేవి తెలిపారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ గుమ్మా సాంబశివరావు అధ్యక్షతన జరిగే ఈ సభలో సత్యాజీ, సింగంపల్లి అశోక్ కుమార్ పాల్గొంటారని తెలిపారు.
సాహితీ సమాలోచన సదస్సు
తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో అంబటి @ 30 అంబటి వెంకన్న సాహితీయానం ఆధ్వర్యంలో సాహితీ సమాలోచన సదస్సు నిర్వహించనున్నది. ఈనెల 22వ తేదీ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈ సదస్సు జరుగుతుంది. కవి, విమర్శకుడు డా.బెల్లి యాద య్య అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో డా.బీ నర్సింగరావు ముఖ్యఅతిథిగా పాల్గొంటారు.
కవితల పోటీలకు ఆహానం
నెల్లూరులోని చిన్ని నారాయణరావు సాహితీ ఫౌండేషన్, పాలపిట్ట సంయుక్త ఆధ్వర్యంలో కవితల పోటీ నిర్వహిస్తున్నది. ఈ పోటీకి సకల ప్రాంతాల వారు కవితలను పంపించవచ్చునని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గలవారు తమ కవితలను ఎడిటర్, పాలపిట్ట, ఫ్లాట్ నెం:3, బ్లాక్-6, ఎంఐజీ-2, ఏపీహెచ్‌బీ, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్-500 044 అనే చిరునామాకు ఈనెల 30వ తేదీలోగా పంపాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9490099327 నెంబర్లో సంప్రదించాలని తెలిపారు.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

