నిశ్చలాకాంక్ష
నీకోసం కొత్త రెక్కలు తెచ్చాను రా ఆ వెలుగు నది ఒడ్డున జ్ఞానేంద్రియాలు కుప్పలుగా పడుంటాయ్
నీకోసం కొత్త రెక్కలు తెచ్చాను రా
ఆ వెలుగు నది ఒడ్డున
జ్ఞానేంద్రియాలు కుప్పలుగా
పడుంటాయ్
సజీవ కాలువలోనేమో
వాసనల ఒండ్రు నీళ్లు
ముక్తి ప్రవాహ దిశలో
తేటగా మారుతూ పోతుంటాయ్
మన ముఖాలు తూర్పు మొగులు
బంగారు వెలుతురులో
నిద్రలేచిన శిషువులై
పాల తెలుపు కొంగల వరుసనో
స్తబ్దుగా నింపాదిగా మెరుస్తున్న
చెట్ల ఆకుల తలలనో వీక్షిస్తూ
జీవరాశుల శబ్దాలను ఆలింగనం
చేసుకున్న ప్రకృతి సుగంధానికి
మైమరచి మనల్ని అప్పజెప్పినప్పుడు
మామూలు స్పృహలోంచి
ప్రగాఢ సృష్టి ఏకాగ్రతలోకి లాగబడి
నిశ్చలాకాంక్షులమై
ఇన్నాళ్లూ ఈడ్చుకొచ్చిన బతుకులోని
నిస్సార అర్థరహిత
విలువహీన చర్యలను
పాము కుబుసంలా విడిచిపెడుతూ
భారరహితమయ్యే సరికి
అప్పుడు అనుకోకుండానే
ఆ రెక్కలు మన భుజాలకు
మొలిచుంటాయ్!!
సిసలైన దృగ్గోచర స్వేచ్ఛాపటం
ఆవిష్కృతమవుతుంది!
రఘు వగ్గు
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

