జలియన్ వాలాబాగ్లో నివాళి
ఇక్కడ కోకిలల కుహు కుహు స్వరాలు వినబడవు కాకుల కావు కావుమనే కర్కశ ధ్వనులు తప్ప! భ్రమరాలని భ్రమింపజేసే నల్లటి కీటకాలు తప్ప
ఇక్కడ కోకిలల కుహు కుహు స్వరాలు వినబడవు
కాకుల కావు కావుమనే కర్కశ ధ్వనులు తప్ప!
భ్రమరాలని భ్రమింపజేసే నల్లటి కీటకాలు తప్ప
విరిసీ విరియని మొక్కలు కూడా
కంటకాలలో చిక్కుకునే ఉన్నాయి
ఆ చెట్లు, పుష్పాలు ఎండిపోయాయి, మాడిపోయాయి
పరిమళ రహితమైన పుప్పొడి రేణువులు
మరకలుగా నిండిఉన్నాయి
అయ్యో!
ఈ అందమైన ఉప వనము రక్తసిక్తమైంది.
ఓ ఋతురాజా! ప్రవేశించు!! కానీ, నెమ్మదిగా…
ఇది సంతాప స్థలం సుమా
ఇక్కడ అల్లరి చేయకు..
వాయువుని మందగతితో ప్రవహింపజేయి
దుఃఖపు నిట్టూర్పులను తరిమేయి.
కోకిలల కుహు కుహురావం
ఇక్కడ ఏడుపు స్వరంలా ఉంది.
భ్రమరాల జూంకారం తమ కష్టాలను చెప్పుకుంటోంది.
చల్లని సుగంధమూ ,
హిమబిందువులతో తడిసిన
పుష్పాలను తీసుకురా!!
శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆ పుష్పాలను హృదయపూర్వకంగా సమర్పించు…
అంతే మనం చేయగలిగేది.
హిందీ మూలం: సుభద్ర కుమార్ చౌహాన్
తెలుగు అనువాదం: పారనంది నిర్మల
పారనంది నిర్మల
9985103804
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

