రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత
తెలంగాణలో చలి చంపేస్తున్నది. రాత్రివేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం వణికిపోతున్నారు. చలి తీవ్రత పెరుగడంతో పొగమంచు కమ్మేస్తున్నది. ఉదయం 9 గం టల వరకు సూర్యుడు కనిపించడం లేదు.
- అత్యల్ప స్థాయికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో చలి చంపేస్తున్నది. రాత్రివేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం వణికిపోతున్నారు. చలి తీవ్రత పెరుగడంతో పొగమంచు కమ్మేస్తున్నది. ఉదయం 9 గం టల వరకు సూర్యుడు కనిపించడం లేదు. ఉత్తరాది నుంచి వీస్తున్న చల్లటి గా లులు తెలంగాణపై ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం, హనుమకొండ వంటి జిల్లాల్లో పగలు ఎం డ ప్రభావం కనిపిస్తున్నది.
సాయంత్రం ఐదు గంటలు దాటగానే చలి తీవ్రత మొ దలవుతున్నది. వారం రోజులుగా మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సీజన్లో కోహీర్లో 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికా ర్డు అయ్యాయి. జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్కల్, కంగ్టి ప్రాంతాల్లో చలి క్ర మంగా పెరుగుతున్నది. ఆదివారం రాష్ట్రంలోని కుమ్రం భీం జిల్లా సర్పూర్లో 11.4 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా గాంధారీలో 11.6 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా నాగర్కర్నూల్లో 12.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

