చలి తీవ్రతతో పక్షులు గజగజ!
తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. ఉత్తర-తూర్పు దిశల నుంచి వీస్తున్న చలిగాలుల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్ కంటే తకువకు పడిపోయాయి.
- వాతావరణ మార్పులతో తీవ్ర ఇబ్బందులు
- వలస పక్షుల రాకపైనా ప్రభావం
- తీవ్రమైన పోషకాహార కొరత
- రక్షణచర్యలు చేపట్టాలంటున్న పర్యావరణ, పక్షి ప్రేమికులు
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. ఉత్తర-తూర్పు దిశల నుంచి వీస్తున్న చలిగాలుల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్ కంటే తకువకు పడిపోయాయి. ఈ వాతావరణ మార్పులు మనుషులనే కాకుండా, మూగజీవాలు, పక్షులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కరువు, ఎల్ నినో పరిస్థితుల ప్రభావం వల్ల పక్షుల సంతానోత్పత్తి గణనీయంగా తగ్గిపోతున్నదని అంతర్జాతీయ పర్యావరణ, పక్షి శాస్త్రవేత్తల తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులు, ఆహార కొరత కారణంగా పక్షులు గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని కోల్పోవడంతోపాటు, పుట్టిన పిల్లలను బతికించుకోవడం కూడా కష్టమవుతున్నదని నివేదికలు పేర్కొంటున్నాయి.
నల్లమల వంటి అటవీ ప్రాంతాల్లో సహజ నీటి వనరులు ఎండిపోతుండటంతో వన్యప్రాణులతోపాటు స్థానిక పక్షులు దాహార్తితో జనావాసాల వైపు వస్తున్నాయని గుర్తించారు. చెరువులు, కుంటలు ఎండిపోవడం వల్ల నీటి పక్షుల ఆవాసాలు, సంతానోత్పత్తి కేంద్రాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల స్థానిక పక్షులతోపాటు వలస పక్షుల మనుగడ, వాటి ప్రయాణ మార్గాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతున్నదని చెప్తున్నారు. చలికాలంలో పక్షులను కాపాడుకోవడానికి ప్రజలు తమవంతు సాయం చేయాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. అందులో భాగంగా ఇంటి డాబాలపై లేదా బాలనీల్లో పక్షుల కోసం గింజలు, కొద్దిగా నీటిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

