అమరావతి : తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం ( Road accident ) జరిగింది. కాలినడకను విజయవాడ దుర్గమ్మ ( VIjayawada Durgamma ) దర్శనానికి కాలినడకన వెళ్తున్న భవానీ భక్తుల (Bhavani devotees) పైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భవానీలు మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడులో 16వ నంబర్ జాతీయ రహదారి గుండా కొంత మంది భవానీ భక్తులు కాలినడకను విజయవాడకు బయలు దేరారు.
ఆదివారం అతివేగంగా వచ్చిన కారు భక్తులపైకి దూసుకెళ్లడంతో పకతి శివ(35), పకృతి శ్రీను( 22) అనే యువకులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దోసలపాడు గ్రామానికి చెందనివారిగా పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటన పట్ల హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రోడ్డుపై నడిచివెళ్లే భవానీ భక్తుల రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.