TVK Chief : తమిళనాడు (Tamil Nadu) లో ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని టీవీకే చీఫ్ (TVK chief) విజయ్ (Vijay) ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (Rajendra Viswanath Arleker) కు తెలియజేశారు. ఈ మేరకు గవర్నర్‌కు ఒక వినతిపత్రం అందజేశారు. అంతకుముందు విజయ్ అభ్యర్థన మేరకు గవర్నర్ అర్లేకర్ తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేను ఆహ్వానించారు. దాంతో విజయ్ తన పార్టీ ముఖ్యనాయకులతో కలిసి బుధవారం లోక్‌భవన్ (Lok Bhavan) కు వెళ్లారు. తాము ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామంటూ ఆయనకు లేఖ అందజేశారు.
టీవీకే ఈ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (118 సీట్లు) దక్కలేదు. సొంతంగా 107 స్థానాలు గెలిచిన టీవీకేకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరో 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల మద్దతు కోసం టీవీకే ప్రయత్నాలు చేస్తోంది. దాంతో ఐదుగురు ఎమ్మెల్యేల బలమున్న కాంగ్రెస్ టీవీకేకు షరతులతో కూడిన మద్దతు ప్రకటించింది. మతతత్వ శక్తులకు దూరంగా ఉంటేనే మద్దతు కొనసాగుతుందని స్పష్టంచేసింది.
ఇక ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకుగానూ టీవీకే 107 స్థానాలు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. అంటే టీవీకేకు మరో 11 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ఇప్పుడు ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు లభించింది. ఇంకో ఆరుగురి సపోర్టు కావాలి. అందుకోసం టీవీకే ఇతర పార్టీలతో సంప్రతింపులు జరుపుతోంది.