Actor Vijay : ప్రముఖ నటుడు, టీవీకే చీఫ్ (TVK Chief) విజయ్ (Vijay) తన పార్టీ క్యాడర్‌తో క్లోజ్డ్ డోర్ మీటింగ్ నిర్వహించారు. కాంచిపురం జిల్లా (Kanchipuram district) లోని మూడు తాలూకాల నుంచి ఎంపిక చేసిన క్యాడర్‌తో ఆయన సమావేశమయ్యారు. కరూర్ తొక్కిసలాట అనంతరం టీవీకే ప్రచారం నిలిచిపోవడంతో.. ఇప్పుడు ఆ ప్రచార కార్యక్రమాన్ని పునరుద్ధరించే పనిలో విజయ్ ఉన్నారు.
ఈ క్రమంలో కాంచిపురం జిల్లాలోని మూడు తాలూకాల పార్టీ శ్రేణులతో ఆయన క్లోజ్డ్ డోర్ మీటింగ్ నిర్వహించారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై క్యాడర్‌తో విజయ్ చర్చించినట్లు తెలుస్తోంది. కరూర్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించినట్లు సమాచారం.
కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీవీకే పార్టీని స్థాపించిన విజయ్.. కరూర్ బహిరంగ సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అయితే తొలి ర్యాలీలోనే తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో దాదాపు మూడు నెలలుగా ప్రచారం నిలిచిపోయింది. ఈ క్రమంలో డిసెంబర్ 4న సేలంలో ప్రచార ర్యాలీ కోసం టీవీకే.. పోలీసులను అనుమతి కోరగా వారు నిరాకరించారు.
#WATCH | Kancheepuram, Tamil Nadu: TVK chief and Actor Vijay holds a closed-door interaction with select party cadre and supporters from the three taluks of Kancheepuram district.
(Source: TVK) pic.twitter.com/lKejC0PPCx
— ANI (@ANI) November 23, 2025