Bandana Girl | సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ఎలా వైరల్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. తాజాగా ఎక్స్(ట్విట్టర్) ప్లాట్ఫామ్లో ఒక సాధారణ భారతీయ యువతి పోస్ట్ చేసిన కేవలం రెండు సెకన్ల సెల్ఫీ వీడియో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో విడుదలైన కొన్ని రోజుల్లోనే ఏకంగా 100(ప్రస్తుతం 108) మిలియన్లకు పైగా వ్యూస్‌ను సంపాదించింది.
ఈ వీడియో విశేషాలు: ఆ యువతి ఆటోరిక్షాలో ప్రయాణిస్తూ తన జుట్టుకు బందానా (Bandana) కట్టుకుని, ఒక తెల్లటి దుస్తుల్లో నవ్వుతూ కెమెరా వైపు చూస్తుంది. ఆ వీడియోకి Makeup ate today (ఈరోజు మేకప్ చాలా బాగా కుదిరింది) అనే మూడు పదాల క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోలో ప్రత్యేకంగా ఏమీ లేకపోయినా దాని సహజత్వం, ఆ అమ్మాయి లుక్ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిన్న క్లిప్ అసాధారణమైన రీచ్ సాధించి, అత్యంత తక్కువ సమయంలో అత్యధిక వ్యూస్ పొందిన వీడియోలలో ఒకటిగా నిలిచింది. దీంతో ఆ యువతికి ‘బందానా గర్ల్’ అనే పేరు వచ్చింది.
మీడియా నివేదికల ప్రకారం ఈ యువతిని ప్రియాంగాగా గుర్తించారు. ‘ది జుగ్గర్‌నాట్’ (The Juggernaut)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. స్నేహితులను కలవడానికి ఆలస్యం అవుతుంటే ఆటోలో వెళ్లే సమయంలో అనుకోకుండా మంచి లైటింగ్ కనిపించడంతో, కేవలం రెండు సెకన్లలో ఆ క్లిప్‌ను తీశానని ఇంతటి వైరల్ అవుతుందని తాను ఊహించలేదని తెలిపారు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో ఎక్స్ ఆ యువతికి బ్లూ టిక్ సెలబ్రీటీ హొదాను ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.
Makeup ate today pic.twitter.com/NZ5UFAXxf8
— bud wiser (@w0rdgenerator) November 2, 2025