Namansh Syal : దుబాయ్ ఎయిర్ షో (Dubai Air show) లో ఫైటర్ జెట్ (Fighter jet) కుప్పకూలడంతో ప్రాణాలు కోల్పోయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ (IAF pilot), వింగ్ కమాండర్ (Wing Commander) నామాన్ష్ స్యాల్ (Namansh Syal) భౌతికకాయం తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం కోయింబత్తూర్ (Coimbatore) లోని సూలూర్ ఎయిర్‌బేస్ (Sulur Air base) కు చేరుకుంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన భౌతికకాయాన్ని తమిళనాడుకు తరలించారు.
అక్కడ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం స్యాల్ భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామానికి తరలించనున్నారు. అక్కడ భారత వాయుసేన అధికారిక లాంఛనాలతో స్యాల్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గత శుక్రవారం దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదవశాత్తు ఆయన మరణించారు.
ఎయిర్ షోలో భాగంగా విన్యాసాలు నిర్వహిస్తుండగా.. భారత వాయుసేనకు చెందిన తేజస్ ఫైటర్ జెట్ ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ఘటనలో ఆ జెట్ నడుపుతున్న ఎయిర్ ఫోర్స్ పైలట్, వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్ దుర్మరణం పాలయ్యారు.
#WATCH | Tamil Nadu: The mortal remains of Wing Commander Namansh Syal, who lost his life in the LCA Tejas crash during the Dubai Air Show, were brought to Sulur Air Base in Coimbatore.
(Source: District Administration) pic.twitter.com/d7F62rzOyZ
— ANI (@ANI) November 23, 2025