Flamingos : ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రాజస్థాన్ (Rajasthan) లోని ఉప్పునీటి సరస్సు అయిన సాంభార్ సరస్సు (Sambhar Salt Lake) కు భారీ సంఖ్యలో వలసపక్షులు (Migratory birds) తరలివచ్చాయి. ముఖ్యంగా ఫ్లెమింగో పక్షులు (Flamingo birds) పెద్ద సంఖ్యలో వచ్చి సందడి చేస్తున్నాయి. ఏటా అక్టోబర్ నుంచి మార్చి నెలల మధ్య ఈ సరస్సులో వలస పక్షుల సందడి కొనసాగుతుంది.
అయితే ఈసారి వర్షాలు భాగా కురవడంతో నీట వనరు పెరిగి మునుపటి కంటే అధిక సంఖ్యలో వలస పక్షులు వచ్చి సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఫ్లెమింగో పక్షులు ఈ సరస్సులో కనువిందు చేస్తున్నాయి. మిగతా వలస పక్షులతో పోల్చితే ఫ్లెమింగ్ పక్షులే భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చాయి. ఈసారి సరస్సుకు రెండు నుంచి రెండున్నర లక్షల ఫ్లెమింగో పక్షులు వచ్చాయని పక్షి ప్రేమికుడు గౌరవ్ దదీచ్ చెప్పారు.
#WATCH | Jaipur | Flamingos flock to Rajasthan’s Sambhar Salt Lake.
Along the Central Asian Flyway, a significant migratory route, Sambhar is one of the most favoured destinations for migratory birds, especially Flamingos. pic.twitter.com/ODYPTSIS5g
— ANI (@ANI) November 23, 2025
తాను గడిచిన 12 ఏళ్లుగా ఇక్కడికి వచ్చే వలసపక్షులను పరిశీలిస్తున్నానని, ఇప్పటివరకు మొత్తం 300 రకాల పక్షి జాతులను గుర్తించానని గౌరవ్ చెప్పారు. ఫ్లెమింగ్లతోపాటు రకరకాల బాతులు, ఇతర రకాల పక్షులు ఇక్కడికి వస్తుంటాయని ఆయన తెలిపారు. వలస పక్షులు వచ్చే ఈ టైమ్ పీరియడ్లో పర్యాటకులు, ఫొటోగ్రాఫర్లు, ప్రకృతి ప్రేమికులు, పక్షి ప్రేమికులు ఇక్కడి భారీగా వస్తుంటారని అన్నారు.