TTD instructions | తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచన
TTD instructions | తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ అధికారులు కీలక సూచన చేశారు. ఇప్పటి వరకు తిరుమల, ఎగువ ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం కారణంగా స్థానికులు, యాత్రికులు పొదుపుగా నీటిని వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తిరుమల : తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ (TTD) అధికారులు కీలక సూచన చేశారు. ఇప్పటి వరకు తిరుమల, ఎగువ ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం కారణంగా స్థానికులు (Local People), యాత్రికులు (Pilgrims) పొదుపుగా నీటిని వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుమల (Tirumala) లోని ఐదు ప్రధాన డ్యామ్లలో లభ్యమయ్యే నీరు రాబోయే 120-130 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతుందని అధికారులు పేర్కొన్నారు.
తిరుమలలో ప్రతిరోజూ దాదాపు 43 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారని, ఇందులో 18 లక్షల గాలన్లు తిరుమల డ్యామ్ల నుంచి మిగిలిన నీరు తిరుపతిలోని కళ్యాణి డ్యామ్(Kalyani Dam) నుంచి సేకరించబడుతుందని తెలిపారు. తిరుమలలోని గోగర్భం, ఆకాశ గంగ, పాప వినాశనం, కుమారధార, పసుపుధార డ్యామ్ల మొత్తం నిల్వ సామర్థ్యం 14,304 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం తిరుమలలో కేవలం 5,800 లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే అందుబాటులో ఉందని వెల్లడించారు.
అక్టోబరు 4 నుంచి 12 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలను సందర్శించే వేలాది మంది భక్తుల ప్రయోజనాల దృష్ట్యా, నీటి వృథాను, నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని స్థానికులకు , భక్తులకు సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

