హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ఎటువంటి అడ్వాన్స్ లేకుండానే వివాహాది శుభకార్యాలకు టీఎస్ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నట్టు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇందుకోసం డిపో మేనేజర్‌ను లేదా టీఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్ 040-30102829, 040-68153333 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.