హైదరాబాద్, డిసెంబర్ 28: హైదరాబాద్ నగర సమీపంలోని పాశమైలారం వద్ద ఉన్న టీఎస్ఐఐసీ పారిశ్రామిక పార్క్‌లో జీరో లిక్విడ్ డిస్చార్జ్ కామన్ ఎప్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్(జెడ్ ఎల్డీ-సీఐటీపీ) అభివృద్ధి చేసేందుకు కాంట్రాక్ట్‌ను రాంకీ ఎన్విరో ఇంజినీర్స్ లిమిటెడ్ దక్కించుకున్నది. ఈ ప్లాంట్‌లో తొలుత రోజు 480 కిలోలీటర్ వ్యర్థ జలాలను శుద్ది చేయనుంది. టీఎస్ఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ వెంకట్ నరసింహా రెడ్డి మాట్లాడుతూ..జేఎల్డీతో కూడిన సీఈటీపీలకు భారీ డిమాండ్ ఉన్నదన్నారు.