Mutton keema | ఘుమఘుమలాడే మాంసాహారం.. మెంతికూర మటన్ కీమా.. మీరూ ట్రై చేయండి..!
Mutton keema : ఎంత నాన్ వెజ్ ప్రియులకు అయినా ఎప్పుడూ అచ్చం మాంసం వంటలు తినడంవల్ల బోర్ కొడుతుంటుంది. అంతేగాక అచ్చం మాంసం వంటలు తినడం వల్ల రక్తంలో కొవ్వు పేరుకునే ప్రమాదం ఉంది. ఈ కారణంగానే ఈ మధ్య మాంసంతోపాటు ఆకు కూరలో, కూరగాయలో కలుపుకుని వండుకోవడం ఎక్కువైంది. మెంతి కూర, మటన్ కీమా మిక్స్డ్ కర్రీ కూడా ఈ కోవకు చెందినదే. మటన్ కీమాను మెంతి కూరతో కలిపి వండటంవల్ల కూర రుచిగా ఉండటమేగాక, మన శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. మరి ఈ స్పెషల్ కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Mutton keema : ఎంత నాన్ వెజ్ ప్రియులకు అయినా ఎప్పుడూ అచ్చం మాంసం వంటలు తినడంవల్ల బోర్ కొడుతుంటుంది. అంతేగాక అచ్చం మాంసం వంటలు తినడం వల్ల రక్తంలో కొవ్వు పేరుకునే ప్రమాదం ఉంది. ఈ కారణంగానే ఈ మధ్య మాంసంతోపాటు ఆకు కూరలో, కూరగాయలో కలుపుకుని వండుకోవడం ఎక్కువైంది. మెంతి కూర, మటన్ కీమా మిక్స్డ్ కర్రీ కూడా ఈ కోవకు చెందినదే. మటన్ కీమాను మెంతి కూరతో కలిపి వండటంవల్ల కూర రుచిగా ఉండటమేగాక, మన శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. మరి ఈ స్పెషల్ కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు
- శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ కీమా 250 గ్రాములు
- రెండు కట్టలు శుభ్రం చేసి పెట్టుకున్న మెంతి కూర
- సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్
- మటన్ మసాలా, బిర్యానీ ఆకులు
- కొద్దిగా పసుపు, తగినంత కారం, ఉప్పు, ధనియాల పొడి
తయారీ ఇలా..
కుక్కర్లో కొద్దిగా నూనె పోసి శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ కీమాను అందులో వేయాలి. దానికి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం బాగా కలిపి మూతపెట్టాలి. నాలుగైదు విజిల్స్ వచ్చే దాకా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నూనెలో జీలకర్ర వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
ఆ తర్వాత మూకుడు పెట్టుకొని సన్నగా తరిగి పెట్టుకున్న మెంతి ఆకులు వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మూకుడులోనే కొద్దిగా నూనె వేడిచేసి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేయాలి. అవి చిటపట లాడుతుండగా వెల్లుల్లి, అల్లం పేస్ట్, ధనియాల పొడి , ఉల్లిపాయలు, బిర్యానీ ఆకులు, గరం మసాలా వేసి వేయించాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న మటన్ కీమా వేసి నీళ్లు ఇగిరే దాకా సన్న సెగమీద ఉడకనివ్వాలి. చివరగా ముందుగానే వేయించి పెట్టుకున్న మెంతికూర, కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా ఉడకనివ్వాలి. మంచి సువాసనతో కుతకుత లాడుతూ కూర ఉడుకుతుంది.
దీనికి అవసరమైతే రెండు చిన్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. కూర పూర్తిగా ఉడికేదాకా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. అంతే ఎంతో రుచికరమైన మటన్ కీమా మెంతికూర కర్రీ రెడీ.. తర్వాత దీన్ని చక్కని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ, నిమ్మ స్లైస్లతో అందంగా గార్నిష్ చేయండి. ఈ కూరను రైస్తోగానీ, చపాతీలతోగానీ చక్కగా ఆరగించవచ్చు. అన్నం, చపాతీ లాంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన మటన్ కీమాను ఎవరైనా ఎంతో ఇష్టంగా తింటారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

