వాషింగ్టన్, ఆగస్టు 31 : రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా తన కక్ష సాధింపు చర్యల్ని మరింత పెంచింది. తాము విధించినట్టుగానే భారత్‌పై సెకండరీ టారిఫ్‌లు విధించాలని యూరప్ దేశాలపై ఒత్తిడి తీసుకొస్తున్నది.
అంతేగాకుండా భారత్ నుంచి ఇంధనం, సహజవాయువు ఉత్పత్తుల కొనుగోలు చేయటాన్ని వెంటనే ఆపేయాలని శ్వేతసౌధం యూరప్ దేశాలను కోరింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు భారత్ ఆపకపోతే సెకండరీ టారిఫ్‌లను విధించాలని యూరప్ దేశాలకు ట్రంప్ సర్కార్ సూచిస్తున్నది.