బెర్లిన్: ఇరాన్‌పై యుద్ధం చేసిన అమెరికా దాన్ని ఆపేందుకు ఇబ్బందిపడుతోంది. ఆ దేశంతో జరుగుతున్న శాంతి చర్చల్లో ప్రగతి కనిపించడం లేదు. అయితే ఇరానీ నేతలు అమెరికాను అవమానించారని, ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ఆ యుద్ధానికి ముగింపు పలకలేపోతున్నారని జర్మనీ ఛాన్సలర్(Germany Chancellor) ఫ్రెడ్రిచ్ మెర్జ్ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం నుంచి తప్పించుకునేందుకు అమెరికాకు దారులు దొరకడం లేదని ఆయన విమర్శించారు. చాలా నైపుణ్యంతో ఇరాన్ తన చర్చలు కొనసాగిస్తున్నదని, ఓ రకంగా ఆ దేశం అసలు చర్చలు నిర్వహించడం లేదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. శాంతి చర్చలు జరుగుతున్న ప్రక్రియ ఆధారంగా ఇరానీ నాయకత్వం అమెరికాను అవమానించినట్లు తెలుస్తోందన్నారు. రెవల్యూషనరీ గార్డ్స్ ఆ క్రియను చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. వెస్ట్రన్ జర్మనీలో జరిగిన ఓ కార్యక్రమంలో మెర్జ్ విద్యార్థులతో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ వార్ వల్ల జర్మనీలో కూడా ఇంధన ధరలు పెరిగాయి. దీంతో అక్కడ మెర్జ్ సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో ఆయన అమెరికా వైఖరిని తప్పుపట్టాల్సి వస్తోంది.