హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గొప్ప విజయం సాధించబోతున్నదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తంచేశారు. నాలుగు నెలలుగా పార్టీ గెలుపు కోసం కష్టపడిన పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గ ఓటర్లు చైతన్యాన్ని ప్రదర్శించారని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకోవడం వారి చైతన్యానికి నిదర్శనమని చెప్పారు. ఓటేసిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ మార్గదర్శకత్వం.. హుజూరాబాద్ ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధించబోతున్నామని పేర్కొన్నారు. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సహకరించిన పార్టీ శ్రేణులకు ఆయన అభినందనలు తెలిపారు.