హైదరాబాద్ : రాష్ర్ట ఆర్థిక మంత్రి హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తున్నాయి. ట్విట్టర్ వేదికగా హరీష్‌రావుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, టీఆర్ఎస్ నాయకులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే కరోనా కారణంగా హరీష్ రావు బర్త్ డే వేడుకలకు దూరంగా ఉన్నారు.
హరీష్ రావుకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ తిగుళ్ల పద్మారావు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, మంత్రులు మహముద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, ప్రకాశ్ గౌడ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, సుంకె రవిశంకర్, మర్రి జనార్ధన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, సుధీర్ రెడ్డి, అరికెపూడి గాంధీ, కోరుకంటి చందర్, వొడితెల సతీష్ కుమార్, దివాకర్ రావు, జోగు రామన్న, జీవన్ రెడ్డి, ఆరూరి రమేశ్, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకటేశ్ నేత ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఉన్నారు.
Thank you Santhosh for your wishes https://t.co/fZeJyD2p5r
— Harish Rao Thanneeru (@trsharish) June 3, 2021
Thanks Anna https://t.co/tJZQxlOPVk
— Harish Rao Thanneeru (@trsharish) June 3, 2021
Thank you Satyavathi Garu https://t.co/hn4rMdqGbw
— Harish Rao Thanneeru (@trsharish) June 3, 2021