నల్లగొండ : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకుల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. పార్టీ అభ్యర్థి నోముల భగత్‌కు మద్దతుగా ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, శంకర్ నాయక్, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, తేరా చిన్నపరెడ్డి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా గురువారం త్రిపురారం మండలంలోని లచ్చతండాలో వరికోసే కూలీలను కలిసి వారి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాసేపు కూలీలకు విశ్రాంతినిచ్చిన నేతలు పొలంలో నడుం వంచి వరి కోత కోశారు.
*నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిరుమర్తి విస్తృత స్థాయి ఎన్నికల ప్రచారం*
— Chirumarthy Lingaiah (@MLAChirumarthy) April 1, 2021
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ బడుగుల,ఎమ్మెల్సీలు శ్రీనివాస్ రెడ్డి,చిన్నపరెడ్డి,ఎమ్మెల్యే శంకర్ నాయక్ లతో కలిసి త్రిపురారం మండలంలోని లచ్చతండాలో వరికోసే కూలీలను కలిసి వారిని(1/2) pic.twitter.com/G9YRIVInkv