Telangana | సొంతంగా తెలంగాణ వొక రాష్ట్రమైతే అందరొలిగె మందిల కలిసి తమ బతుకులను బాగుచేసుకోవచ్చని తెలంగాణ బిడ్డలు ఆరు దశాబ్దాల పాటు ఆశపడ్డరు. ఆశను సావనీయకుంట అలుపులేని పోరాటాలను నడిపించిన్రు. రాజ్యాంగబద్దమైన ప్రజాస్వామిక ఆకాంక్షను సాకారం చేసుకునేందుకు తరాలకు తరాలే, జీవితాలకు జీవితాలే త్యాగాలు చేయవలసి వచ్చింది. రాచరిక పాలననుంచి ప్రజాస్వామిక పాలన దిశగా పయనిస్తున్న దేశ స్వాతంత్య్ర తొలిదశలోనే స్వయం పాలనను చేపట్టవలసిన తెలంగాణకు 66 ఏండ్ల తర్వాత కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్రమయ్యే అవకాశం వచ్చింది.
తెలంగాణ ఎందుకు రాదో చూస్తనని జలదృశ్యంలో మొదటి దీక్ష పట్టి అదే మొదలుగా పద్నాలుగేండ్లు వనవాసం పోయినట్టు ఉద్యమ జనవాసాన్ని కొనసాగించిండు ముఖ్యమంత్రి కేసీఆర్. తన అలుపెరగని ఉద్యమ ప్రస్థానంలో భాగంగా తెలంగాణను ఐక్యం చేసిండు.
ఎప్పటికప్పుడు బొలపరిచ్చుడు మాటలు చెప్పి తెలంగాణ జనాల ఆకాంక్షలతోని కాంగ్రెస్ పార్టీ ఆడుకున్నది. అరవయేం డ్ల సంది తెలంగాణ సమాజంతోని వోట్లేయించుకునుడు అక్క ర తీరంగనే తప్పించుకునుడు. ఇట్లాంటి కాంగ్రెస్ ద్రోహపూరిత పరిస్థితుల్లో కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమ కెరటాలై ఎగిసిపడుతున్న సందర్భంలో ‘కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చు డో’ అని స్వరాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ ఆమరణ దీక్ష పట్టిండు. ఉద్యమ సారథి కేసీఆర్ దీక్షకు మద్దతుగా యావత్ తెలంగాణ పిడికిలి బిగించింది. మేధావులు, సామాన్యులు, సర్వ వృత్తులు, సకల జనులు ఎక్కడివాల్లక్కడ ఉద్యమ నిప్పురవ్వలయిండ్రు. వారు పెట్టిన ఉద్యమ మంట పల్లె పట్నం తేడాలేకుండా పోరాట దివిటీలను ఎలిగించి తెలంగాణ జైత్రయాత్రను సాగించింది.
కేసీఆర్ నాయకత్వంలో పిడుగులు కురిపించిన తెలంగాణ ఉద్యమానికి ఢిల్లీ పెద్దలు తలవంచక తప్పలేదు. డిసెంబరు 9న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం ప్రకటన చేసింది. కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించిన సమైక్యవాదులు ఎన్నో కుట్రలు చేసిండ్రు. కేంద్రం వెనకకు పోయింది. అయినా వారి కుయుక్తులేవీ కేసీఆర్ పట్టుదల పోరాట పటిమ ముందు నిలబడలేకపోయాయి. చావునోట్లో తలపెట్టి, ప్రాణాలకు తెగిం చి కేసీఆర్ చేసిన పోరాటం చివరకు అంతిమ లక్ష్యాన్ని ముద్దాడి తెలంగాణ ప్రజల 60 ఏండ్ల స్వరాష్ట్ర కాంక్షను 2014 జూన్ 2 నాటికి సాకారం చేసింది. మహోజ్వలమై ప్రజారాసులను కదిలించిన దీక్షా దివస్ స్పూర్తిని నాటి మహోన్నత లక్ష్యాన్ని నేటి కీలక సందర్భంలో మనం స్మరించుకోవాల్సి ఉన్నది.
కుటుంబాన్ని సక్కదిద్దాలంటెనే ఆపసోపాలుపడుతున్ననేటి కాలంలో రాష్ట్ర సాధనకోసం పూనుకోవడం మామూలుది కాదు. కొట్లాడే ఇంటోనితోని కాల్లు గుంజే బయటోనితోని తట్టుకొని నిలబడడం ఎంత కష్టం. వచ్చిన తెలంగాణను సదిరి కుదురుకున్న దాకా కాపాడడం ఇంకెంత కష్టం. అది కేసీఆర్ తోని తప్ప సామాన్యులతో అయ్యే పనికాదు. త్యాగాల పునాదుల మీద తెచ్చుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానం పదేండ్లు నిండకముందే ఇంత గొప్పగా వెలుగులను విరజిమ్ముతున్నదంటే అల్లటప్పా వ్యవహారం కాదు. అది దీక్షాదక్షుడు, తెలంగాణ ఏకాత్మ కేసీఆర్ వల్లెనే సాధ్యమైంది. అటువంటి తెలంగాణ నేడు అనివార్యమైన ప్రజాస్వామిక పరిస్థితుల్లో మూడోసారి ఎన్నికలకు పోతూ.. నాలుగు బజాట్లకాడ నిలబడ్డది.
నవంబర్ 30 ఎన్నికలకు వొక రోజు ముందుగాల దీక్షా దివస్ వస్తున్నది. అదే స్పూర్తితో మరోసారి దీక్షాదక్షులుగా మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం తెలంగాణ సమాజానికి ఉన్నది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కలలు నిజమయ్యే కాలాన కాంగ్రెస్ గాలానికి చిక్కకుంటా తప్పుదారి మల్లించే చేతులను మనం పసిగట్టాల్సి ఉన్నది. ఎన్నికల పేరుతో ఐదేండ్లకోపాలి మన గడ్డమీదికొచ్చి మనలను రెచ్చగొట్టి మనలో ద్వేషాన్ని నింపిపోతున్న పరాయి రాష్ర్టాల టూరిస్టుల పట్ల వాల్ల ఇక్కడి తొత్తుల పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది.
అరవై ఏండ్ల సంది మంది మాటలు న మ్మి మల్ల మల్ల ఆగమైన తెలంగాణ ఇప్పుడిప్పుడే కేసీఆర్ బాటల నడుస్తూ వొక దరికిచేరుకుంటున్నది. కుదురుకుంటున్న తెలంగాణను మల్లోపాలి చెదరగొట్టాలని చూడబోతున్న ద్రోహులను తరిమికొట్టాల్సిన స్ఫూర్తిని మనం దీక్షా దివస్ నుండి అందుకోవాల్సి ఉన్నది. తెలంగాణను బతికించిన నాటి కేసీఆర్ దీక్షా స్ఫూర్తితో నేడు తెలంగాణను గెలిపించేందుకు తెలంగాణ సమాజం తిరిగి పట్టుబట్టవలసి ఉన్నది.
కలిసి పనిచేసే క్రమంలో ఉత్పన్నమయ్యే చిన్నచిన్న మనస్పర్ధలు, భావోద్వేగాలు, అపార్థాలు, అసంతృప్తులను మనసుమీదికి తెచ్చుకోవద్దు. అడిగిందియ్యలేదని మన కుటుంబంల ఉన్నట్టే అలుగుడు గులుగుడు ఉంటయి. ఘర్షణ ఐక్యత దిశగా సాగాలె. బంధం బలపడేదిక్కుపోవాలి తప్ప బలహీన పడేందుకు కాదు. మనం ఇప్పుడు మన బలాలను పంచుకునే సందర్భంలో ఉన్నాం మన భావోద్వేగ బలహీనతలను కాదు. మన స్వీయ మానసిక ధోరణులను దూరం పెట్టి రేపటి మన పిల్లల భవిష్యత్తు పట్ల సామాజిక తాత్విక చింతనతో ఉండాలి. స్థిత ప్రజ్ఞతతో కూడిన దార్శనికతతో అందరం ఎప్పటోలిగనే ముందుకు సాగాలి. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష. అందుకే 2009 నవంబర్ 29 దీక్షా దివస్ స్పూర్తిగా, ఈ నవంబర్ 30న కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధి కొనసాగింపులో భాగస్వామ్యులమౌదాం.
రమేశ్ హజారి
93909 19090