ఆల్ఫా జనరేషన్‌తో పరేషాన్ కావొద్దంటే..!
నిన్నటి తరం పిల్లలు ‘చిట్టి చిలకమ్మా... అమ్మ కొట్టిందా..’అని చెబుతుంటే బుద్ధిగా ఊ కొట్టేవారు. కానీ, నయా జనరేషన్ జోలపాట కూడా డిజిటల్‌గానే కావాలంటున్నారు.
నిన్నటి తరం పిల్లలు ‘చిట్టి చిలకమ్మా… అమ్మ కొట్టిందా..’అని చెబుతుంటే బుద్ధిగా ఊ కొట్టేవారు. కానీ, నయా జనరేషన్ జోలపాట కూడా డిజిటల్‌గానే కావాలంటున్నారు. డిజిటల్ ఎరా తొలితరంగా పేరుమోసిన ఆల్ఫా జనరేషన్ (2010 తర్వాత పుట్టినవాళ్లు) రాకతో మిలీనియల్స్ జమానాకు చెందిన వాళ్లు పేరెంట్స్‌గా అవతరించారు. స్మార్ట్ వరల్డ్‌తో దోస్తీ చేసిన మిలీనియల్స్‌కి.. ఈ ఆల్ఫా జనరేషన్ ఆలనాపాలనా కత్తి మీద సాములా పరిణమిస్తున్నది. సాంకేతికత, అంతర్జాలం, కృత్రిమ మేధస్సు ఈ తరం పిల్లల జీవితంలో చిన్నప్పటి నుంచే భాగమయ్యాయి. ఈ నేపథ్యంలో పేరెంటింగ్‌లో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. పిల్లల పెంపకంలో పేరెంట్స్ వినూత్న పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఏర్పడింది.
జనరేషన్ ఆల్ఫా పిల్లలు సాంకేతికతతో మమేకమై ఉంటారు. టెక్నాలజీ వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఏ విషయమైనా ఇట్టే పట్టేసుకుంటారు. ఈ తరానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. అవి ఇవే.
- పసితనం నుంచే స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు,స్ట్రీమింగ్ సేవలకు అలవాటు పడతారు. ఆన్లైన్ లెర్నింగ్, వాయిస్ అసిస్టెంట్ల వినియోగం వీరికి సర్వసాధారణం.
- చిన్న వీడియోలు, గేమ్‌లు, గ్రాఫిక్స్ ద్వారా త్వరగా నేర్చుకుంటారు. వీరి అటెన్షన్ స్పాన్ తక్కువగా ఉంటుంది.
- అంతర్జాలం ద్వారా ప్రపంచంలోని వివిధ సంస్కృతులు, దృక్కోణాలను చిన్నప్పుడే తెలుసుకుంటారు.
- తమ అవసరాలు, అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని కోరుకుంటారు.
పెంపకంలో సవాళ్లు..
- ఈ డిజిటల్ ప్రపంచంలో పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి.
- స్క్రీన్ టైమ్ నిర్వహణ: పిల్లలకు గ్యాడ్జెట్లను ఎంతసేపు, ఎలా ఇవ్వాలి అనేది అతిపెద్ద సవాలు. అధిక స్క్రీన్ టైమ్ ఏకాగ్రతను తగ్గించవచ్చు, నిద్రలేమికి దారితీయవచ్చు.
- భద్రత, ఆన్లైన్ బెదిరింపులు: ఆన్లైన్లో అసురక్షిత కంటెంట్, సైబర్ బెదిరింపుల నుంచి పిల్లలను రక్షించడం.
- సామాజిక, భావోద్వేగ అభివృద్ధి: డిజిటల్ ఇంటరాక్షన్లు పెరగడం వల్ల నిజ జీవితంలో సామాజిక నైపుణ్యాలు, మానసిక అనుబంధాలు తగ్గే ప్రమాదం ఉంది.
- సృజనాత్మకత, ఊహ: భౌతిక ఆటలు తగ్గడం వల్ల సృజనాత్మకత, ఊహాశక్తి అభివృద్ధికి ఆటంకం కలగవచ్చు.
త్రిముఖ వ్యూహం..
ఈ డిజిటల్ యుగంలో పిల్లలను పెంచడం అంత సులభమైన విషయమేమీ కాదు. ఇప్పటి తల్లిదండ్రులకు ఎదురవుతున్న అతి పెద్ద సమస్య పిల్లల పెంపకమే! జీవితాల్లో సాంకేతిక చొరబాటు ఎక్కువై మానవ సంబంధాలు తక్కువ అవుతున్న నేపథ్యంలో పిల్లల సామాజిక, భావోద్వేగ సంక్షేమంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. పేరెంట్స్ పిల్లల సమగ్ర అభివృద్ధికి కొన్ని పద్ధతులు పాటించాలి.
1. సాంకేతిక సమతుల్యత
- నియమిత స్క్రీన్ టైమ్: వయసుకు తగ్గట్టుగా స్క్రీన్ టైమ్‌ను పరిమితం చేయాలి. నో-స్క్రీన్ జోన్లు (భోజన సమయం, పడక గది) ఏర్పాటు చేయాలి.
- నాణ్యమైన కంటెంట్: వినోదం మాత్రమే కాకుండా, విద్యాపరమైన, సృజనాత్మకతను పెంచే కంటెంట్‌ను ఎంచుకోవాలి.
- డిజిటల్ లిటరసీ: ఇంటర్నెట్, ఆన్లైన్ భద్రత గురించి, ప్రైవసీ గురించి చిన్నప్పటి నుంచే నేర్పించాలి.
2. భావోద్వేగ పెంపకం
- ఓపెన్ కమ్యూనికేషన్: పిల్లల భావాలను, అభిప్రాయాలను గౌరవించాలి. ఎలాంటి భయం లేకుండా మాట్లాడే వాతావరణం కల్పించాలి.
ఎమోషనల్ కోచింగ్: భావోద్వేగాలను ఎలా అర్థం చేసుకోవాలి, నిర్వహించుకోవాలో నేర్పించాలి.
నాణ్యమైన సమయం: గ్యాడ్జెట్లు లేకుండా కుటుంబంతో కలిసి ఆడటం, చదవడం, మాట్లాడటం లాంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి.
3. సమగ్ర అభివృద్ధి
- శారీరక శ్రమ: అవుట్డోర్ ఆటలు, ఇతర క్రీడలకు ప్రోత్సహించాలి.
- సృజనాత్మక కార్యకలాపాలు: పెయింటింగ్, మ్యూజిక్, కథలు చెప్పడం లాంటివి అలవాటు చేయాలి.
- విలువలు, బాధ్యత: దయ, పంచుకోవడం, ఇతరులను గౌరవించడం లాంటి మానవ విలువలను బోధించాలి. డబ్బును, వనరులను ఎలా బాధ్యతాయుతంగా ఉపయోగించాలో నేర్పించాలి.
జనరేషన్ ఆల్ఫా పిల్లలను పెంచడం ఒక కొత్త ప్రయాణం. ఆధునిక పద్ధతులు, సాంకేతికతపై అవగాహన, ప్రేమ, సహనం అనే నాలుగు స్తంభాలపై ఆధారపడి తల్లిదండ్రులు తమ పిల్లలను భవిష్యత్ ప్రపంచానికి సిద్ధం చేయాలి. టెక్నాలజీని ఒక సాధనంగా ఉపయోగించుకుంటూ, మానవ సంబంధాలు, విలువను బోధిస్తే ఈ తరం పిల్లలు అద్భుతమైన, సమగ్రమైన పౌరులుగా ఎదుగుతారు.
-బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

