కోల్కతా, ఫిబ్రవరి 11: పశ్చిమ బెంగాల్లోని అధికార టీఎంసీలో సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. సీఎం మమత మేనల్లుడైన అభిషేక్ బెనర్జీ సన్నిహితులు శుక్రవారం ‘పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పోస్టు విధానానికి నేను మద్దతు ఇస్తున్నాను’ అంటూ ట్వీట్లు చేశారు. దీంతో వివాదం రేగింది. పార్టీ పోస్టుల్లోనూ, ప్రభుత్వ పదవుల్లోనూ ఉన్న సీనియర్లు ఈ పోస్టులను వ్యతిరేకించారు. జూనియర్లు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఒక వ్యక్తికి ఒకే పోస్టు విధానానికి అభిషేక్ బెనర్జీ మొదటి నుంచి మద్దతిస్తున్నారు. దీన్ని పార్టీలో జూనియర్లు స్వాగతిస్తున్నారు. కానీ సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నారు.