కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండలం రంజని గ్రామంలో జాదవ్ సచిన్ (24) అనే గిరిజన యువకుడు (Tribal youth) పురుగుల మందు తాగి ఆత్మహత్య ( Suicide ) చేసుకున్నాడు. ఎస్సై కృష్ణారెడ్డి ( SI Krishna Reddy) తెలిపిన ప్రకారం వివరాలు.. సచిన్ గత కొంతకాలంగా ప్రతిరోజు మద్యం సేవిస్తూ (Alcohol addiction) ఇంట్లో వారితో గొడవ పడుతుండేవాడని వివరించారు. ఈ క్రమంలో తల్లి ఆయనను తాగుడు మానేయాలని మందలిస్తూ వస్తుంది.
తాజాగా సోమవారం కూడా తాగి ఇంటికి రావడంతో తల్లి మందలించింది. దీంతో జీవితంపై విరక్తి చెందిన సచిన్ మంగళవారం తన చేనులో మద్యం సేవించిన మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. స్థానికులు గమనించి కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పంచనామా అనంతరం మృతదేహాన్ని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి చిన్నాన్న చవాన్ శివరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.