e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home News స్వచ్ఛమైన ఆక్సిజన్ కోసం చెట్లను పెంచాలి

స్వచ్ఛమైన ఆక్సిజన్ కోసం చెట్లను పెంచాలి

నిజామాబాద్‌ : స్వచ్ఛమైన ఆక్సిజన్ కోసం చెట్లను పెంచాలని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా రూద్రూరు మండల కేంద్రం, సులేమాన్ ఫారంలో జరిగిన పలు కార్యక్రమాలలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో మిషన్ భగీరధ పథకం ద్వారా పరిశుభ్రమైన తాగునీరు అందుతుందన్నారు. ఆడబిడ్డకు కష్టం లేకుండా ఇంటింటికి తాగునీరు, రైతుల కోసం గుంటగుంటకు సాగునీరు అందించడమే నా సంకల్పమని స్పీకర్‌ తెలిపారు.

హైదరాబాద్ నుంచి బైన్సా వరకు మంజూరైన నూతన జాతీయ రహదారిలో భాగంగా ఎల్లారెడ్డి నుంచి బాన్సువాడ- వర్ని మీదుగా రుద్రూరు వరకు నిర్మించడానికి రూ. 300 కోట్లు మంజూరు అయ్యాయి. రుద్రూరు గ్రామంలో సెంట్రల్ లైటింగ్, సైడ్ డ్రైనేజితో నాలుగు వరుసలుగా రహదారిని నిర్మిస్తారని తెలిపారు. అదేవిధంగా మద్నూర్ నుంచి పోతంగల్- కోటగిరి- బోదన్ మీదుగా నిజామాబాద్ కు మరో జాతీయ రహదారి మంజూరు అయిందన్నారు. త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయి.

- Advertisement -

ఈసందర్భంగా రుద్రూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన రైతువేదికను, మండల విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని ప్రారంభించారు. కస్తూర్బా పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా సులేమాన్ ఫారంలో ఉర్దూ మీడియం పాఠశాల నూతన భవనానికి శంకుస్థాపన చేశారు.

ఇవి కూడా చదవండి..

పరవళ్లు తొక్కుతున్న పొచ్చర జలపాతం

నరసింహులపల్లి సమస్యలను పరిష్కరిస్తా : మంత్రి కొప్పుల

టీఆర్ఎస్‌ పార్టీలోకి ఎల్ ర‌మ‌ణ‌?

బ్లాక్ ఫంగస్‌తో హెల్త్ సూపర్ వైజర్‌ మృతి

ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana