హైదరాబాద్ : తెలంగాణలో టీడీపీకి భారీ షాక్ తగలనుందా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ నాయకులంతా ఇతర పార్టీల్లో చేరారు. ఇక తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కూడా ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ.. టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రమణ.. మరికాసేపట్లో ప్రగతి భవన్కు వెళ్లనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్తో రమణ సమావేశమై పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అయితే గులాబీ పార్టీలో చేరే అంశంపై సీఎం కేసీఆర్తో సమావేశం అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.