హైదరాబాద్, ఏప్రిల్3 (నమస్తే తెలంగాణ): మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో అంతర్జాతీయ ట్రాన్స్జెండర్ల దినోత్సవాన్ని ట్రాన్స్ ఉత్సవ్2023 పేరిట నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా రాష్ట్ర దివ్యాంగులు, వయోవృద్ధుల, లింగమార్పిడి వ్యక్తుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వేడుకలను నిర్వహించనున్నారు.
ఈ వేడుకలకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాద్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొన్న ట్రాన్స్జెండర్లకు ఎకనామిక్ రిహాబిలిటేషన్ సపోర్ట్ స్కీం కింద రుణాలను అందజేయనున్నారు. ఇప్పటికే లింగమార్పిడి వ్యక్తుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిన విషయం తెలిసిందే.